KCR: కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

KCR: రేపు విచారిస్తామని తెలిపిన సీజేఐ డీవై చంద్రచూడ్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 July 2024 7:46 PM IST
Hearing on the petition filed by KCR adjourned till tomorrow
X

KCR: కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా         

KCR: కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రేపు విచారిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని, జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదంటూ గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో.. చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. విచారణకు రావాలంటూ కమిషన్... కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ ఆరోపిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story