HCUకు అరుదైన ఘనత

HCUకు అరుదైన ఘనత
x
Highlights

దేశంలోని బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌కు 2020 సంవత్సరానికి ర్యాంకులను ఔట్ లుక్‌ మ్యాగ్‌జైన్ ప్రకటించింది. దీంట్లో టాప్‌-25 సెంట్రల్‌...

దేశంలోని బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌కు 2020 సంవత్సరానికి ర్యాంకులను ఔట్ లుక్‌ మ్యాగ్‌జైన్ ప్రకటించింది. దీంట్లో టాప్‌-25 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో జేఎన్‌యూ మొదటి స్థానంలో నిలవగా హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీకి రెండోస్థానం దక్కింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఔట్‌లుక్‌-ఐసీఏఆర్ఈ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం పొందింది. ప్రథమ స్థానంలో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నిలిచింది. మొత్తం వెయ్యికి గాను జేఎన్‌యూ 931.67 స్కోర్ చేసింది. 887.78 స్కోర్‌తో హెచ్‌సీయూ ద్వితీయస్థానం సాధించింది. దేశంలోని అత్యుత్తమ టాప్-25 వర్సిటీలతో ఈ జాబితా వెలువడింది.

యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ల కోసం ఔట్‌లుక్-ఐసీఏఆర్‌ఈ ఇండియా యూనివర్సిటీ చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంది. ప్రధానంగా అకడమిక్, రీసెర్చ్‌ ఎక్స్‌లెన్స్‌, ఇండస్ట్రీ ఇంటర్ఫేస్‌, ప్లేస్‌మెంట్, వసతులు, గవర్నెన్స్, అడ్మిషన్లు, డైవర్సిటీ, ఔట్‌రీచ్‌ వంటి పరిమితులతో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. ఇక దేశంలోని 25 ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ రెండోస్థానం పొందడం గర్వంగా ఉందంటున్నారు విద్యార్థులు, అధ్యాపకులు. అంతేకాదు వర్సిటీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. ఔట్‌లుక్-ఐసీఏఆర్‌ఈ ఇండియా ర్యాంకింగ్స్‌-2020లో రాష్ట్రం నుంచి చోటు దక్కించుకున్న మరో వర్సిటీ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం. జాబితాలో 24వ స్థానం పొందింది. మొత్తం వెయ్యి స్కోరుకు గాను 436.88 సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories