Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం

Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Oct 2024 6:47 AM IST
Haryana Governor Bandaru Dattatreya Escaped From Road Accident
X

Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం

Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాన్వాయ్ కు ఓ వ్యక్తి అడ్డు రావడంతో కాన్వాయ్ లోని ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒకదాని వెనుక ఒక వాహనం మూడు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి.

ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అప్రమత్తమై అక్కడి నుంచి బండారు దత్తాత్రేయ కారును సెఫ్టీగా ముందుకు వెళ్లేలా ట్రాఫిక్ ను క్లియర్ చేసినట్లు తెలుస్తొంది. మరోవైపు బండారు దత్తాత్రేయ గతంలోను ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి బైటపడినట్లు తెలుస్తొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని .. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story