Harish Rao: గురుకులాల్లో సమస్యలు, విద్యార్థుల ఆందోళనలపై హరీష్‌రావు ట్వీట్

Harish Rao: తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు.. నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారని హరీష్‌రావు ఫైర్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2024 6:16 PM IST
Harish Rao tweets about issues in Gurukulas and students concerns
X

Harish Rao: గురుకులాల్లో సమస్యలు, విద్యార్థుల ఆందోళనలపై హరీష్‌రావు ట్వీట్

Harish Rao: తెలంగాణ గురుకులాల్లో సమస్యలు, విద్యార్థుల ఆందోళనలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి హరీష్‌రావు. తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రావాలని, సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళనను ప్రస్తావిస్తూ హరీష్ ట్వీట్ చేశారు.

పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారని వాపోయారు. గురుకులాల పరిస్థితుల గురించి ప్రతిపక్షంగా తాము ఎన్ని సార్లుచెప్పినా మీకు చీమ కుట్టినట్లైనా ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story