Harish Rao: పోలీసులకు హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్.. విర్రవీగితే మీకూ ఏపీ అధికారులకు పట్టిన గతే..

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అధికారం ఉందని విర్రవీగితే ఏపీలో ఏమైందో చూశామంటూ తెలంగాణ పోలీసులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Sept 2024 12:29 PM IST
Harish Rao Strong Warning to Telangana Police
X

Harish Rao: పోలీసులకు హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్..

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అధికారం ఉందని విర్రవీగితే ఏపీలో ఏమైందో చూశామంటూ తెలంగాణ పోలీసులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం పోలీసు అధికారులు సస్పెన్షన్‌లు, అరెస్ట్‌లు ఎదుర్కొంటున్నారని చట్టాలకు లోబడి పనిచేయకపోతే అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

కాలువలకు గండ్లు పడితే.. 22 రోజులైనా పూడ్చలేకపోయిన అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లా రైతులు సాగునీరు లేక అల్లాడుతున్నారని.. భూములు నెర్రలు వారుతున్నాయని.. అందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని ఆరోపించారు. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం జిల్లా రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story