Harish Rao: అన్నిదానాల్లో కెల్ల అవయవదానం గొప్పది

Harish Rao: అవయవదానంలో దేశంలోనే తెలంగాణ ముందుంది

Jyothi
Updated on: 27 Nov 2022 6:53 PM IST
Harish Rao Speech On National Organ Donation Day Program
X

Harish Rao: అన్నిదానాల్లో కెల్ల అవయవదానం గొప్పది

Harish Rao: అన్న దానాల్లో కెల్ల అవయవదానం గొప్పదన్నారు హెల్త్ మినిష్టర్ హరీష్ రావు. అవయవదానంలో తెలంగాణ దేశానికే ఆదర్శమన్న మంత్రి.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మిగతా రాష్ట్రాలను సైతం అనుసరించడం అభినందనీయం అన్నారు. అవయవదానం దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆద్వర్యంలో ఆర్గాన్స్ డోనేట్ చేసిన వారి కుటుంబ సభ్యులను మంత్రి హరీష్ రావు ఘనంగా సన్మానించారు. డాక్టర్లను ప్రాణదాతలు అంటున్నాము కానీ నిజమైన ప్రాణ దాతలు ఆర్గాన్ డొనోట‌ చేసే వారి కుటుంబ సభ్యులేనని గుర్తు చేశారు. ఒకరి అవయవదానం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు నిలబెడుతున్నారని గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 179 మంది ఆర్గాన్స్ డొనేట్ చేసినట్లు తెలిపారు. ప్రతి దశలోనే ఇలాంటి వారిని ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story