Harish Rao: రేవంత్ వద్ద సరుకు లేదు... లీకులతో కాలం గడుపుతున్నారు

Harish Rao: అబద్ధాల్లో బీజేపీ బడేమియా అయితే... కాంగ్రెస్ చోటే మియా అని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్ రావు.

Arun Chilukuri
Updated on: 12 April 2024 7:31 PM IST
Harish Rao Slams Revanth Reddy
X

Harish Rao: రేవంత్ వద్ద సరుకు లేదు... లీకులతో కాలం గడుపుతున్నారు

Harish Rao: అబద్ధాల్లో బీజేపీ బడేమియా అయితే... కాంగ్రెస్ చోటే మియా అని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్ రావు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాటతప్పారని హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ వద్ద సరుకు లేదని... అందుకే లీకులు ఇస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటని... ప్రచారం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేయొద్దని ఆయన వెల్లడించారు. పెన్షన్ విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటు వేసి కొత్త సమస్యలను నెత్తిన పెట్టుకోవద్దని ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీష్ రావు తేల్చి చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story