Harish Rao: కాంగ్రెస్‌ సభ్యుల వ్యాఖ్యలపై స్పందించిన హరీష్‌రావు

Harish Rao: హిళా ఎమ్మెల్యేలపై రేవంత్ వాఖ్యలు ఖండిస్తున్నా

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 July 2024 5:08 PM IST
Harish Rao responded to the comments of Congress members
X

Harish Rao: కాంగ్రెస్‌ సభ్యుల వ్యాఖ్యలపై స్పందించిన హరీష్‌రావు 

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు మండిపడ్డారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాలను తుంగలోతొక్కుతూ,ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పా.?అని ప్రశ్నించారు.

రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నలమరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీడయడమే తాము చేసిన తప్పా.? అని పేర్కొన్నారు. మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్క బెడుతున్నారని పేర్కొన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story