Harish Rao: అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు.. అధికారం లేనప్పుడు కుంగిపోవద్దు

Harish Rao: భవిష్యత్ మనదే.. కార్యకర్తలు అధైర్య పడొద్దు

Shekhar G
Updated on: 12 Dec 2023 4:31 PM IST
Harish Rao Participated In Sangareddy BRS Thanks Giving Meeting
X

Harish Rao: అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు.. అధికారం లేనప్పుడు కుంగిపోవద్దు

Harish Rao: మన ప్రభుత్వం రాలేదని కుంగిపోవద్దని కార్యకర్తలకు సూచించారు మాజీ మంత్రి హరీష్‌రావు. సంగారెడ్డి బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన్న ఆయన..రాబోయే పంచాయతీ, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ సత్తా చూపించాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు..అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేసిన ఆయన...అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదని.. అధికారం పోయినప్పుడు కూడా కుంగిపోరాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ తెలంగాణ ప్రజల పక్షమేనని..భవిష్యత్ మనదే.. కార్యకర్తలు అధైర్య పడొద్దంటూ మాజీమంత్రి హరీష్‌రావు ధైర్యం నూరిపోశారు.

Shekhar G

Shekhar G

Next Story