Harish Rao: పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలన్న హరీష్ రావు

Harish Rao: మద్దతు ధరతో పూర్తిమొత్తం కొనుగోలు చేయాలి

Jyothi
Updated on: 8 April 2024 11:03 AM IST
Harish Rao Letter to CM Revanth Reddy
X

Harish Rao: పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలన్న హరీష్ రావు

Harish Rao: రైతు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వరుస లేఖాస్త్రాలు సంధిస్తున్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. తాజాగా పొద్దు తిరుగుడు పంట కొనుగోలుపై సీఎంకు బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. 6 వేల 760 మద్దతు ధరతో కొంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చినా.. కేంద్రం ఇచ్చే నిధులతో మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదన్నారు.

కేంద్రం 37 వేల 3 వందల క్వింటాళ్ల కొనుగోలుకే అంగీకరించడంతో.. రైతులు 75 శాతం పంట తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేసిందని.. ప్రస్తుత ప్రభుత్వం కూడా మద్దతు ధరతో పూర్తిమొత్తం పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story