హైదరాబాద్‌లో అఖిల భారత ఉద్యానవన ప్రదర్శనను ప్రారంభించిన హరీష్‌రావు

Harish Rao launches All India Park Exhibition in Hyderabad
x

Representational Image

Highlights

* మొక్కల పెంపకమే.. భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి: హరీష్‌రావు * మంచి పర్యావరణంతోనే మనిషి ఆరోగ్యం ముడిపడి ఉంది: హరీష్‌రావు

మొక్కలు పెంచడమంటే భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి ఇచ్చినట్లేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అడవుల పునరుద్ధరణ చేపట్టి, పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంచి పర్యావరణంతోనే మనిషి ఆరోగ్యం ముడిపడి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని గుర్తించే హరితహారం, సామాజిక అడవుల పెంపకం, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నగర, పట్టణ స్థానిక సంస్థలు తప్పనిసరిగా పది శాతం నిధులు పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. అనంతరం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన అఖిల భారత ఉద్యానవన ప్రదర్శనను హరీష్‌రావు ప్రారంభించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories