Harish Rao: ప్రోటోకాల్ ఉల్లంఘనలపై హరీశ్ రావు ఫైర్

Harish Rao: చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ని కోరిన హరీశ్ రావు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 July 2024 7:15 PM IST
Harish Rao Fired for Violations of Protocol
X

Harish Rao: ప్రోటోకాల్ ఉల్లంఘనలపై హరీశ్ రావు ఫైర్

Harish Rao: ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఉల్లంఘనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు. మూడు సార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా అని ప్రశ్నించారు. ప్రజలు గెలిపించిన నాయకులకు విలువలేదా అని నిలదీశారు. మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి.... కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మారెడ్డికి అధికారులు సలాం కొట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రొటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ని కోరారు మాజీ మంత్రి హరీశ్ రావు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story