Harish Rao: హరీష్‌రావు రాజీనామా చేయాలని సీఎం డిమాండ్.. ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చిన హరీష్‌

Harish Rao: BRS హయాంలో 35లక్షల మందికి రూ. 17వేల కోట్లు మాఫీ చేశాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 Aug 2024 12:06 PM IST
Harish Rao counter to Revanth Reddy on X
X

Harish Rao: హరీష్‌రావు రాజీనామా చేయాలని సీఎం డిమాండ్.. ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చిన హరీష్‌

Harish Rao: రుణమాఫీ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హరీష్‌రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేయగా.. అందుకు కౌంటర్ ఇచ్చారు హరీష్. BRS హయాంలో 35లక్షల మంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా..? అందుకు 17,869 కోట్లు మాత్రమే అవుతాయా..? అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు హరీష్. ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నదని కౌంటర్ ఇచ్చారు. మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పాడో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో తానే స్వయంగా పోతానన్నారు హరీష్ రావు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story