Harish Rao: మిషన్ భగీరథలోనూ రేవంత్ లాభాలను వెతుకుతున్నారు

Harish Rao: ఎవరి ఎత్తు ఎంత అనేది ప్రజలకు అవసరం లేదు

Shekhar G
Published on: 27 Feb 2024 7:22 PM IST
Harish Rao Comments On Revanth Reddy
X

Harish Rao: మిషన్ భగీరథలోనూ రేవంత్ లాభాలను వెతుకుతున్నారు

Harish Rao: మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు సీఎం కావడం మన దురదృష్టం అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్ నోట్ విడుదల చేశారు. మిషన్ భగీరథ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది.. దాని లక్ష్యం ఏమిటి అనే విషయాలపై కనీస అవగాహన లేకుండా సీఎం మాట్లాడటం బాధాకరమన్నారు. ప్రజాసంక్షేమంలో లాభనష్టాలు చూసుకోరని ఆక్షేపించారు. ప్రాణహిత చేవెళ్లను కాదని... కాళేశ్వరం కట్టారని ఆరోపిస్తున్నారని... ఇదే విషయాన్ని అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పినా విమర్శలు చేయడం తగదన్నారు.

బీడు భూముల్లో సిరులు పండుతుంటే రైతులు పడే సంతోషం చూడాలి కానీ... రియల్ ఎస్టేట్ వ్యాపారి మనస్తత్వంతో లాభనష్టాలు చూడవద్దని కోరారు. రేవంత్ రెడ్డి ప్రతీసారి తన ఎత్తు గురించి మాట్లాడుతున్నారని... ఎవరెత్తు ఎంత అనేది ప్రజలకు అవసరం లేదన్నారు. ప్రజల కోసం ఎవరెంత పనిచేస్తున్నారనేదే వారికి అవసరమన్నారు హరీశ్ రావు.

Shekhar G

Shekhar G

Next Story