Harish Rao: కేసీఆర్‌ అంటే నమ్మకం.. కాంగ్రెస్‌ అంటే నాటకం

Harish Rao: ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అంటోంది.. 11 సార్లు గెలిచి ఏం చేశారు..?

Jyothi
Published on: 28 Oct 2023 2:24 PM IST
Harish Rao Comments On Congress
X

Harish Rao: కేసీఆర్‌ అంటే నమ్మకం.. కాంగ్రెస్‌ అంటే నాటకం

Harish Rao: కేసీఆర్‌ అంటే నమ్మకమని, కాంగ్రెస్‌ అంటే నాటకమని విమర్శనాస్త్రాలు సంధించారు మంత్రి హరీష్‌రావు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అంటోందని, 11 సార్లు గెలిచి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కనీసం మంచినీళ్ల గోస కూడా తీర్చలేదన్నారు. రాష్ట్రంలో 3 గంటల కరెంట్‌ చాలని కాంగ్రెస్‌ అంటోందని, మహారాష్ట్రలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్‌ ఇస్తున్నారని ఆయన గుర్తుచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ 5 గంటల కరెంటే ఇస్తామంటోందని, 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీష్‌రావు అన్నారు. రైతుబంధు సృష్టికర్త సీఎం కేసీఆర్‌ అన్న హరీష్‌రావు.. రైతుకే డబ్బులు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు.

Jyothi

Jyothi

Next Story