Harish Rao: గన్‌మెన్‌లు లేకుండా పోదాం.. నేనే కారు నడుపుతా..

Harish Rao: తెలంగాణలో మూసీపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Oct 2024 1:39 PM IST
Harish Rao Demands Govt Should Lift Suspension On Telangana Special Police
X

Harish Rao: ఆ 39 కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

Harish Rao: తెలంగాణలో మూసీపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చతికలపడి, మూసీని ముందు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అటకెక్కాయని, ప్రజల దృష్టికి మరల్చేందుకే మూసీని తెరపైకి తెస్తున్నారంటూ మాట్లాడారు హరీష్‌రావు. సీఎం పదవి స్థాయిని దిగజార్చే విధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల వద్దకు వెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించారు. గన్మెన్ లు లేకుండా పోదాం అని సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు. నేను కార్ నడుపుకుంటూ వస్తాను.. నా పక్కన కూర్చో.. ఇద్దరం కలిసి వెళ్దామని హరీష్ రావు సవాల్ విసిరారు. అంతకంటే ముందు మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి అక్కడి నుంచి మల్లన్నసాగర్, ఆర్ అండ్ ఆర్ కాలనీ, రంగనాయకసాగర్ కట్ట వద్దకు వెళ్దామన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story