మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీరుపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం

* ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి తనను పిలవకపోవడంపై అసంతృప్తి

Dhatripriya
Published on: 16 Feb 2023 4:49 PM IST
Guvvala Balaraju Is Impatient With The Behavior Of Srinivas Goud
X

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీరుపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం

Guvvala Balaraju: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి తనను పిలవకపోవడంపై ఆయన మంత్రిపై గుర్రుగా ఉన్నారు. కొంతమంది క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌లో ఇళ్ల స్థలాలు ఇచ్చి కిన్నెర మొగిలయ్యకు బీఎన్‌రెడ్డి నగర్‌లో స్థలం ఇవ్వడంపై గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగిలయ్యను ఢిల్లీ తీసుకెళ్లి రాష్ట్రంలో అందరికీ తన కళను గుర్తుచేసింది తానేనని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బాలరాజు స్పష్టం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story