నార్సింగిలో కాల్పుల కలకలం

నార్సింగిలో కాల్పుల కలకలం
x
Highlights

Gun Firing at Narsingi Hyderabad : హైదరాబాద్ నార్సింగి హైదర్ష్ కోట లో కాల్పుల కలకలం రేగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని విశ్రాంత ఆర్మీ...

Gun Firing at Narsingi Hyderabad : హైదరాబాద్ నార్సింగి హైదర్ష్ కోట లో కాల్పుల కలకలం రేగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని విశ్రాంత ఆర్మీ జవాన్‌ నాగ మల్లేష్‌గా గుర్తించారు. నాగ మల్లేష్‌ రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో.. ఒకటి గాల్లోకి వెళ్లగా, మరకొటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెవి పక్క నుంచి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పులకు మందు పార్టీ కారణమని తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌లోని తన ఇంటిపై హైరీచ్ ఇంటర్నెట్ సిబ్బంది మందు పార్టీ చేసుకుంటున్నారని, పలుమార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదన్న కోపంతో నాగ మల్లేష్ ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.Show Full Article
Print Article
Next Story
More Stories