logo
తెలంగాణ

Hyderabad: హైదరాబాద్‌ జీడిమెట్లలో విషాదం.. వివాహేతర సంబంధం కారణంగా..

Govt Teacher Chandra Shekar Self Destruction in Jeedimetla Hyderabad | Telugu Online News
X

Hyderabad: హైదరాబాద్‌ జీడిమెట్లలో విషాదం.. వివాహేతర సంబంధం కారణంగా

Highlights

Hyderabad - Jeedimetla: గొడవల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం...

Hyderabad - Jeedimetla: హైదరాబాద్‌ జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా అర్దాసుపల్లికి చెందిన చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రశేఖర్‌కు శ్రీలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. చంద్రశేఖర్‌ నగరంలోని ఫలక్ నామా ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా, భార్య శ్రీలత అబిడ్స్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరు జీడిమెట్లలోని శ్రీసాయి కాలనీలో తమ ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు.

భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. భర్తకు వేరొక స్త్రీతో అక్రమ సంభందం ఉందనే విషయంలో వీరిగొడవ తారా స్దాయికి చేరుకుంది. భర్త చంద్రశేఖర్‌ జీవితం మీద విరక్తి చెంది సాయంత్రం తన ఇంట్లోని బెడ్ రూమ్ లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని‌ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Web TitleGovt Teacher Chandra Shekar Self Destruction in Jeedimetla Hyderabad | Telugu Online News
Next Story