ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ 50 వేల ఆర్దిక సహాయం

ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ 50 వేల ఆర్దిక సహాయం
x
ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్
Highlights

వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన నిరుపేద ఆటో డ్రైవర్ మెకల రమేష్ రెండవ కూతురు అంజలికి ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ 50 వేల ఆర్దిక సహాయం.

వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన నిరుపేద ఆటో డ్రైవర్ మెకల రమేష్ రెండవ కూతురు అంజలి జేఈఈ లో అలిండియా ర్యాంక్ 2444 సాధించి మద్యప్రదేశ్ ఇండోర్ ఐఐటి లో బీటెక్ మొదటి సంవత్సరం సీటు సాధించింది. చదువుకునే ఆర్ధిక స్థోమత లేకపోవడం తో యూనియన్ నాయకత్వం మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారి ధృష్టికి తీసుకెళ్లడం వారు స్పంధించి ఆ అమ్మాయికి మొదటి సంవత్సరం ఫీజు మొత్తం 50వేల రూపాయలను వారి దయాహృదయం తో వ్యక్తి గతంగా నగదు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పోరెటర్ వేముల శ్రీనివాస్, మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్‌ ఈసంపల్లి సంజీవ, ప్రధాన కార్యదర్శి మంద శ్రీధర్ రెడ్డి, అర్బన్ అధ్యక్షులు కలకొట్ల జయరాం, అధికార ప్రతినిధి మడికొండ బాబు, గ్రెటర్ అద్యక్షులు టి.హారిచంద్రు నాయక్, అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిలుకర స్వామి, ఉపాద్యక్షులు గుండా రమేష్, జిల్లా నాయకులు, మామిడాల వెంకన్న, యండి ఖాజ, దెవర మల్లేషం, చీకటి కుమార్, తండా సదానందం, ఈర రవి, శంకర్ నాయక్, మేకల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories