మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు

S. Srikanth
Updated on: 20 Jan 2020 7:34 PM IST
మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు
X

నిర్మల్: జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు జనవరి 21, 22 తేదీలలో లోకల్ సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. ప్రశాంతి తెలిపారు. జిల్లాలో ఈనెల 22న నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనున్నందున, ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు 21, 22 తేదీలలో లోకల్ హాలిడేగా ప్రకటించడం జరిగిందన్నారు.

22 వ తేదీన పోలింగ్ జరుగు రోజున మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే పోలింగ్ జరుగు ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్, ప్రైవేట్ అండర్ టేకింగ్, కమర్షియల్, ఇండస్ట్రియల్ సంస్థలలో పనిచేస్తున్న క్యాజువల్ లేబర్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజు మూడు గంటలు సంబంధిత యజమాన్యాలు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.

S. Srikanth

S. Srikanth

Next Story