తెలంగాణ సర్కార్ సంస్కరణలకు శ్రీకారం

తెలంగాణ సర్కార్ సంస్కరణలకు శ్రీకారం
x
ఆర్టీసీ
Highlights

తెలంగాణ సర్కార్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ నష్టాలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా బస్సు సర్వీసులను తగ్గించాలని యోచిస్తుంది. ఇప్పటికే...

తెలంగాణ సర్కార్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ నష్టాలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా బస్సు సర్వీసులను తగ్గించాలని యోచిస్తుంది. ఇప్పటికే టిక్కెట్ల రేట్ల పెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా బస్సుల కుదింపుతో కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రవాణా సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఉన్న బస్సులు తగ్గించాలనుకోవడంపై యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ నష్టాలను తగ్గించుకునేందుకు హైదరాబాద్ సిటీలో బస్సు సర్వీసులు తగ్గించేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రణాళికలు సిద్దం చేసింది. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న 3750 బస్సు సర్వీసుల్లో వెయ్యి బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించారు. ప్రతినిత్యం నగరంలో 33 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మెట్రో వచ్చినా నగర ప్రజా రవాణాలో 40 శాతం ఆర్టీసీ బస్సులపైనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. 7500 బస్సులు అవసరమని రవాణా రంగ నిపుణులు చెబుతుంటే ఉన్న బస్సులను తొలగిస్తుండటం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులు పెంచుకోవాల్సిన ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ తగ్గించుకునే పనిలో పడింది. ప్రతి రోజు రూ.1.20 కోట్ల నష్టం వస్తోందని, ఇలా ఏడాదికి రూ.440 కోట్ల నష్టం వస్తుండడంతో బస్సులనే తగ్గించాలని నిర్ణయించారు. ఆర్టీసీ నిర్ణయంపై యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రోకు మేలు చేయడం కోసమే బస్సులు తగ్గిస్తున్నారని విమర్శిస్తున్నారు. కార్మికులను తగ్గించుకోవడానికే ఆర్టీసీ ప్రక్షాలన చేస్తున్నారన్నారని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులతో బలవంతపు సంతకాల సేకరణ నిలిపి వేయలన్నారు.

ఇది ఇలా ఉంటే బస్సులు తగ్గించడంపై ఉన్నతాధికారులు భిన్నంగా స్పందిస్తున్నారు. నగరంలో నడుపుతున్న బస్సులు పదేళ్ళు దాటినవని మరమ్మత్తుల పేరుతో రోజు మూడు వందల వాహానాలు మూలన పడుతున్నాయని చెబుతున్నారు. డ్రైవర్ల కొరతతో పాటు కొందరు విధులకు గైర్హాజరవుతున్నారని అంటున్నారు. బస్సు సర్వీసల క్రమబద్దీకరణపై ప్రయాణికుల నుంచి వస్తున్న వ్యతిరేకతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories