ప్రేమించడం లేదని అమ్మాయిపై కత్తితో దాడి

Girl Attacked in Nalgonda After Rejecting Love
x

ప్రేమించడం లేదని అమ్మాయిపై కత్తితో దాడి 

Highlights

Nalgonda: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ప్రేమోన్మాది దాడి

Nalgonda: మరో దారుణం. తెలంగాణలో మరో ఘోరం. ప్రేమ పేరుతో ఓ అమ్మాయిపై మానవ మృగం చేసిన దాడి కలకలం రేపింది. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనే శాడిజానికి అమాయకురాలైన ఓ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో పడింది. నల్గొండలో తన సీనియర్ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించిన రోహిత్ అనే స్టూడెంట్ తన ప్రేమను ఆక్సెప్ట్ చేయలేదనే కసితో కత్తితో దాడి చేశాడు. ఫారెస్ట్‌ పార్క్‌లో ఉంటున్న రోహిత్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తన కాలేజీలోనే ఇటీవలే డిగ్రీ కంప్లీట్ చేసిన నవ్య అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ప్రేమిస్తున్నానంటూ గత 7 నెలల నుంచి ఆ అమ్మాయి వెంటపడ్డాడు. అయితే తనను పట్టించుకోని నవ్యపై కోపం పెంచుకున్నాడు.

తనకు దక్కని అందం వేరొకరికి సొంతం కాకూడదనే కసితో ఆమెను ఎలాగైనా అంతమొందించాలనే ప్లాన్ వేశాడు రోహిత్. తన ఫ్రెండ్‌ సాయి ద్వారా నవ్యను పార్క్‌కు రప్పించాడు. అప్పటికే అక్కడ ఉన్న రోహిత్ కాసేపు మాట్లాడుదాం అని నవ్యను ఒప్పించాడు. అలా మాట్లాడుతుండగానే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో నవ్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కడుపు, కాళ్లు, చేతులు, మొహంపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో నవ్య స్పృహ తప్పి పడిపోయింది. అక్కడే ఉన్న సాయి మరో స్నేహితురాలు నవ్యను తొలుత ప్రభుత్వాస్పత్రికి ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నవ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పలు సర్జరీలు చేయాల్సి ఉందని వెల్లడించారు.

ఇటు బాధితురాలి తండ్రి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. గతంలో ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో అసలు ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. రోహిత్‌కు గతంలో ఎలాంటి నేరచరిత్ర ఏదైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories