ఓటింగ్ పెంపునకు జీహెచ్ఎంసీ వినూత్న చర్యలు

ఓటింగ్ పెంపునకు జీహెచ్ఎంసీ వినూత్న చర్యలు
x
Highlights

ఈ ఏడాది గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ఓటింగ్ పెంచేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు...

ఈ ఏడాది గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ఓటింగ్ పెంచేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. ఎన్నికల ముందే ఓటర్లందరికీ ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేసింది. ఓటర్ స్లిప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు. మై జీహెచ్ఎంసీ యాప్‌లో నో యువర్ ఓట్ ఆప్షన్‌లో పేరు, వార్డు ఎంటర్ చేస్తే.. ఓటర్ స్లిప్‌తో పాటు పోలింగ్ స్టేషన్‌ లొకేషన్ గూగుల్ మ్యాప్‌‌లో కనిపించేలా ఎర్పాటు చేశారు. నో- యువర్ ఓట్ పై ప్రసార మద్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

మొట్టమొదటి సారిగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచారు. ఓటరు చైతన్యంపై పెద్ద ఎత్తున హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు కమిటీలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందాల మహిళల ద్వరా ప్రత్యేక ఓటరు చైతన్య కార్యక్రమం చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories