జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మోగనున్న నగారా

X
Highlights
మంగళవారం ఉదయం 10.30 గంటలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. షెడ్యూల్ విడుదల అయితే రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది.
Krishna17 Nov 2020 4:42 AM GMT
కాసేపట్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. షెడ్యూల్ విడుదల అయితే రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల మందికి పైగా ఓటర్లున్నారు. అటు ఎన్నికలకు అన్నీ పార్టీలు సిద్దమవుతున్నాయి.
Web TitleGHMC Elections Notification will be released today
Next Story