జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి.. టీఆర్ఎస్ బల్దియా మేయర్ అభ్యర్ధిని ఎవరో?

జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి.. టీఆర్ఎస్ బల్దియా మేయర్ అభ్యర్ధిని ఎవరో?
x
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రగులుకున్న కొద్ది ఆయా పార్టీల్లో రాజకీయం వేడెక్కుతోంది. అధికార TRS పార్టీలో ఎవరికి మేయర్ పదవి వరించనుందా అనే చర్చ మొదలైంది....

జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రగులుకున్న కొద్ది ఆయా పార్టీల్లో రాజకీయం వేడెక్కుతోంది. అధికార TRS పార్టీలో ఎవరికి మేయర్ పదవి వరించనుందా అనే చర్చ మొదలైంది. జనరల్ మహిళలకు బల్దియా మేయర్ పదవి రిజర్వ్ కావడంతో బలమైన నేతలంత అప్పుడే లాబీయింగ్ మొదలు పెట్టారు. దాదాపు రెండు డజన్లు మంది గులాబీ పార్టీ నుంచి మేయర్ పదవి కోసం గట్టిగా పోటీ పడుతుండం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

GHMC ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది. దీంతో మేయర్‌ పదవి ఎవరిని వరిస్తుందనే ప్రశ్న కూడా మొదలయింది. రిజర్వేషన్ల రోటేషన్ ప్రకారం ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో ఆ పదవి ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వచ్చే డిసెంబర్ నాటికి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ ముగిసేలా పరిస్థితి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ అందుకు అనుగుణంగా చకచకా ఏర్పాట్లు చేసుకుంటూ పోతోంది. మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయిస్తారని తేలడంతో చాలా మంది మహిళా నేతలు ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేయర్ పీఠం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమ అభ్యర్దిత్వం పరిశీలించాలని కేటీఆర్ ని కలిసినప్పుడల్లా కోరుతున్నారు.

మేయర్ పదవిపై చాలా మంది నేతలు దృష్టి సారిస్తున్నారు. తమ కుటుంబీకులను రంగంలోనికి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ మేయర్ బొంతురామ్మోహన్ తన భార్య శ్రీదేవిని బరిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అటు రాజ్యసభ సభ్యుడు కేకే కూతురు గద్వాల్ విజయ లక్ష్మీ మళ్లీ మేయర్ పీఠం ఆశిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి గెలిచి పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి తనకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ మేయర్ తీగల క్రిష్ణారెడ్డి కోడలు సునరితా రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు నగరంలో కీలక నేత మంత్రి తలసాని తన కోడలు మహితను మేయర్ పీఠం కోసం కార్పోరేటర్‌గా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. డిప్యూటి స్పీకర్ పద్మారావు కూడా తన కోడలిని బరిలో నిలుపుతారని అంటున్నారు. ఇక అంబర్ పేట ఎమ్మెల్సీ కాలేరు వెంకటేషన్ సిట్టింగ్ కార్పోరేటర్ అయిన తన భార్య కాలేరు పద్మను మళ్లీ గోల్కాన నుంచి బరిలో నిలిపే యోచనలో ఉన్నారు. అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి తన భార్య బేతి స్వప్నారెడ్డిని హబ్సిగూడ నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. వీల్లంతా మేయర్ పీఠం కోసమే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

బంజారహిల్స్ కార్పోరేటర్ మన్నే కవిత కూడా ప్రయత్నం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కుటుంబీకులను కూడా మేయర్ గా బరిలో నిలుపడం కోసం కార్పోరేటర్ గా పోటీ చేయించాలని చూస్తున్నారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి కీలకమైన మేయర్ పదవిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరికి ఇస్తారనేది ఇంకా స్పష్టం కావడంలేదు అయితే బీసీ మహిళకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories