Patancheru: కాలనీలో పర్యటించిన డిప్యూటీ కమీషనర్ బాలయ్య

రామచంద్రపురం 112 డివిజన్ లోని సాయి నగర్ కాలనీలో ప్రతి శనివారం రోజున కేటీఆర్ ఆదేశం మేరకు బస్తి దర్శన్ కార్యక్రమంలో భాగంగా కాలనీలో డిప్యూటీ కమీషనర్ బాలయ్య పర్యటించారు.

S. Srikanth
Published on: 1 Feb 2020 5:55 PM IST
Patancheru: కాలనీలో పర్యటించిన డిప్యూటీ కమీషనర్ బాలయ్య
X

పఠాన్ చేరు: రామచంద్రపురం 112 డివిజన్ లోని సాయి నగర్ కాలనీలో ప్రతి శనివారం రోజున కేటీఆర్ ఆదేశం మేరకు బస్తి దర్శన్ కార్యక్రమంలో భాగంగా కాలనీలో డిప్యూటీ కమీషనర్ బాలయ్య, జి హెచ్ ఎం సి అధికారులతో,కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి పర్యటించిన స్టాండింగ్ కమిటీ మెంబెర్,112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య.కాలనీలో ఉన్న ప్రతి ఒక్క రోడ్డులో అధికారులతో తిరిగి సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్.

ముఖ్యంగా స్ట్రామ్ వాటర్ డ్రైన్ సమస్య బాగా ఉందని పర్యటనలో దృష్టికి రావడంతో అధికారులతో మాట్లాడి వెంటనే ప్రతిపాదన తయారు చేసి,అత్యవసరమయిన ప్రదేశాలలో ఐ ఆర్ టి డిపార్ట్మెంట్ తో పాట్ హోల్స్ క్లియర్ చేయాలని అధికారులకు తెలిపి డ్రైనేజీ సమస్య,శానిటేషన్,మంచి నీటి సమస్యలపై సంబంధిత అధికారులతో చేర్చించి సమస్య పరిష్కరిస్తాను అని కాలనీ అసోసియేషన్ సభ్యులకు తెలిపిన కార్పొరేటర్ .ఈ కార్యక్రమంలో EE సుదర్శన్, ACP మాధవి, AE ప్రభు,రాజేశ్వర్,శంకర్(అధ్యక్షుడు),గోవర్ధన్ రెడ్డి,నాగ సంగప్ప,భాస్కర్ రావు,శంకర్,చనప్ప,చంద్రమౌళి,సురేష్ తదితరులు పాల్గొన్నారు


S. Srikanth

S. Srikanth

Next Story