బావా త్వరగా కోలుకో: కేటీఆర్ ట్వీట్

బావా త్వరగా కోలుకో: కేటీఆర్ ట్వీట్
x
Highlights

తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావ‌డంతో ఆయ‌న కోలుకోవాలంటూ ప‌లవురు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆకాంక్షిస్తున్నారు....

తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావ‌డంతో ఆయ‌న కోలుకోవాలంటూ ప‌లవురు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆకాంక్షిస్తున్నారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయిన‌ట్టు హ‌రీష్ రావు చేసిన ట్వీట్‌పై ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గెట్ వెల్ సూన్ బావ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇత‌రుల కంటే మీరు త్వ‌ర‌గా కోలుకుంటార‌నే న‌మ్మ‌కం ఉంద‌ని కేటీఆర్ అన్నారు. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లోనే హరీశ్‌కు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ తనను కలిసిన ప్రజాప్రతినిధులు, అధికారులను టెస్ట్ చేయించుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
Show Full Article
Print Article
Next Story
More Stories