Gangula Kamalakar: నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు

Gangula Kamalakar: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.

Arun Chilukuri
Published on: 6 April 2024 4:05 PM IST
Gangula Kamalakar Responds Over Party Change News
X

Gangula Kamalakar: నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు

Gangula Kamalakar: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదని చెప్పారు. పార్టీ మారే వారిని రేవంత్ ప్రోత్సహిస్తారని అనుకోనని అన్నారు. కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌. సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. రానున్న ఎన్నిల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్న ప్రచారంపై గంగుల మాట్లాడుతూ.. ఆ విషయం జూన్ 4న తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ పక్షానే నిలబడతామని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story