రంగారెడ్డి జిల్లాలో దారుణం గంజాయి మత్తులో మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్

* ఓ యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు పరారీలో మరో ఇద్దరు నిందితులు

R Tripura Malini
Updated on: 8 Nov 2022 8:55 AM IST
gang-rape of a minor girl in ranga reddy district
X

రంగారెడ్డి జిల్లాలో దారుణం గంజాయి మత్తులో మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్

Gang-Rape: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఓ మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మీర్‌పేట్‌ పీఎస్‌ పరిధి లెనిన్‌నగర్‌లో ఓ మైనర్‌ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో.. నిందితుల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు కుటుంబ సభ్యులు, స్థానికులు. మరో ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story