ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ గణపయ్య లడ్డూకూ తాకింది!

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ గణపయ్య లడ్డూకూ తాకింది!
x
Highlights

వినాయక చవితి ఉత్సవాలంటే.. పందిరి.. విగ్రహం.. పూజలు.. ప్రసాదాలు.. నిమజ్జనం తో పూర్తి కాదు. మధ్యలో గానేశుని చేతిలో ఉంచిన లడ్డూ వేలం కూడా ఒక పెద్ద కార్యక్రమం. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వినాయకుని ఉత్సవాల్లో లడ్డూ వేలం తప్పనిసరి. ఈ వేలంలో కొన్ని లడ్డూలు లక్షలాది రూపాయలు పలుకుతాయి.

వినాయక చవితి ఉత్సవాలంటే.. పందిరి.. విగ్రహం.. పూజలు.. ప్రసాదాలు.. నిమజ్జనం తో పూర్తి కాదు. మధ్యలో గానేశుని చేతిలో ఉంచిన లడ్డూ వేలం కూడా ఒక పెద్ద కార్యక్రమం. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వినాయకుని ఉత్సవాల్లో లడ్డూ వేలం తప్పనిసరి. ఈ వేలంలో కొన్ని లడ్డూలు లక్షలాది రూపాయలు పలుకుతాయి. భోలాక్ పూర్ లో శ్రీ వరసిద్ధి వినాయక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రతీ ఏడూ ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాల్లో బంగారు లడ్డు ను స్వామి చేతిలో ఉంచుతారు. నిమజ్జనానికి ఒక రోజు ముందు ఆ లడ్డును వేలం వేస్తారు. ఈ సంవత్సరం 123 గ్రాముల బంగారు లడ్డూను 5 లక్షలు వెచ్చించి చేయించారు నిర్వాహకులు. ఆ లడ్డూను ఈరోజు వేలం వేశారు. భక్తులు పోటాపోటీగా ఈ వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. 5001 రూపాయల వద్ద పాత మొదలెట్టారు. అది చ్విఅరికి 7.56 లక్షల వద్ద ముగిసింది. స్థానికంగా చేపల వ్యాపారం నిర్వహించే భైరు విష్ణుప్రసాద్ ఈ బంగారు లడ్డూను దక్కించుకున్నారు.

అయితే, ఇక్కడ గతేడాది 120 గ్రాముల బంగారు లడ్డును కే.భాస్కర్ అనే స్థానికుడు 8.1 లక్షలకు దక్కించుకున్నారు. కానీ, ఈసారి లడ్డు ధర తక్కువ పలకడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికీ, ఇప్పటికీ బంగారం ధర పెరిగింది.. అయినా అప్పటికంటే ఇపుడు వేలంలో తక్కువ ధర పలకడం పై స్థానికులు చర్చించుకున్నారు. ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ గణేశుని లడ్డూ పై కూడా పడిందని సరదాగా కామెంట్స్ చేసుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories