పల్సస్ ఆధ్వర్యంలో మహాత్ముడికి ఘన నివాళి
ప్లాస్టిక్ రహితం..సమాజహితం లక్ష్యంగా స్వచ్ఛభారత్ లో పాల్గొన్న పల్సస్ ఉద్యోగులు ప్లాస్టిక్ వద్దు..పర్యావరణమే ముద్దు నినాదాలతో చైతన్యం రగిలించిన పల్సస్ యాజమాన్యం సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియాతో కలిసి విశాఖ, హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాలు
తెలుగురాష్ర్టాలలో మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమాలు పల్సస్ సంస్థ ఘనంగా నిర్వహించింది. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాతో కలిసి పల్సస్ సంస్థ విశాఖలోనూ, హైదరాబాద్ లోనూ బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ మహాత్ముడు ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. సత్యం, అహింస అనేవి హిమాలయాలంత పురాతనమైనవని గాంధీ చెప్పారని..నేటికీ, ఎన్నటికీ ఆచరించదగ్గ సూత్రాలను గాంధీ మనకి అందించారని పేర్కొన్నారు. మహాత్ముడు చూపిన బాటలో పయనించి దేశా సర్వతోముఖాభివృద్ధి పాటుపడాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్ లో భాగంగా కంపెనీ కార్యకలాపాలు నిర్వహణలో జీరో ప్లాస్టిక్ వాడకాన్ని అమలు చేస్తామని ప్రతినబూనారు. అలాగే పరిసరాలు పరిశుభ్రత, పర్యావరణ హితమైన కార్యక్రమాలకు పల్సస్ చేయూతనిస్తుందని చెప్పారు. 2022 నాటికి ప్లాస్టిక్ రహిత భారత దేశంగా రూపొందడానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఓ ఇరవై ఏళ్ల క్రితం కేన్సర్ మహమ్మారి చాలా అరుదుగా ఎవరికో వచ్చేదని, మితిమీరిన ప్లాస్టిక్ వినియోగంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కేన్సర్ రోగులే కనిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరానికి మించి వాడుతున్న ప్లాస్టిక్ మన జీవితాలను అగమ్యగోచరం చేయనున్నాయని హెచ్చరించారు. మనదేశంలో 2017-18 కాలంలో 16.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ని వినియోగించారని గణాంకాలు చెబుతున్నాయని ఇందులో 80 శాతం రీసైక్లింగ్ కి పనికిరాని చెత్తగానే మిగిలిపోవడం భవిష్యత్ ఆందోళనగా మార్చుతోందన్నారు. మహాత్మగాంధీ స్పూర్తితో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేని దేశంగా 2022 నాటికి భారత్ తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ కార్యక్రమానికి పల్సస్ సంస్థ తన సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ రీసైక్లింగ్కి వీలులేని ప్లాస్టిక్ రహిత రాష్ర్టంగా సిక్కిం ముందుందని, తెలుగురాష్ర్టాల్లోనూ ఈ లక్ష్యం చేరుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ దుబే మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలోని సముద్రాలలో ఇప్పటివరకూ 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయిన, ఇది చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. సముద్రం అట్టడున సంచరించే తిమింగలాల్లోనూ అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ పదార్థాలు చేరుతున్నాయంటే ఏ స్థాయిలో సముద్రాలు కలుషితం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే అంతా కలిసి నో ప్లాస్టిక్ అంటూ నినదిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పల్సస్ సంస్థ సీఈవో గేదెల శ్రీనుబాబు, డైరెక్టర్ గేదెల శంకరరావు, సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ దుబే, వర్మ, పల్సస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలలో చెత్తను ఏరివేసి శుభ్రం చేశారు.
చిన్నారి దియా నోట..బాపూ మాట
పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు కుమార్తె దియా ముద్దుముద్దు మాటలతో గాంధీ తాతను స్మరించుకుంది.
హైదరాబాద్లో జరిగిన మహాత్ముడి జయంతి కార్యక్రమానికి తన తండ్రితోపాటు హాజరైన దియా మాట్లాడుతూ`` గాంధీ మన జాతిపిత అని, ఆయన ఆచరించి చూపిన సత్యం, అహింసా మార్గాలు మనమంతా ఆచరించాలి`` అని చెప్పి అందరినీ అలరించింది.


