గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతదేహం తారుమారు.. ఆందోళనకు దిగిన వైద్యులు..

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతదేహం తారుమారు.. ఆందోళనకు దిగిన వైద్యులు..
x
Highlights

గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. విధులు నిర్వహిస్తున్న తమపై మృతుడి కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ నిరసన చేపట్టారు. ఆస్పత్రి ఆవరణలో...

గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. విధులు నిర్వహిస్తున్న తమపై మృతుడి కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ నిరసన చేపట్టారు. ఆస్పత్రి ఆవరణలో కూర్చొని న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కరోనా కారణంగా బేగంపేట్ గురుమూర్తినగర్ వాసి మరణించాడు. అయితే, ఆయన కుటుంబ సభ్యులకు అతడి మృతదేహం కాకుండా వేరే డెడ్ బాడీని అప్పగించారు. దాంతో, అంత్యక్రియల కోసం స్మశానవాటికకు తీసుకెళ్లిన తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అక్కడే వైద్య సిబ్బందితో కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగారు.

దాంతో, తమపై దాడిని నిరసిస్తూ గాంధీ ఆస్పత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. విధులు నిర్వహిస్తున్న తమపై మృతుడి కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories