'ప్లాస్మా'థెరపీతో కోలుకుంటున్నకరోనా బాధితుడు

ప్లాస్మాథెరపీతో కోలుకుంటున్నకరోనా బాధితుడు
x
Gandhi Hospital (File Photo)
Highlights

భారత వైద్య మండలి ICMR మార్గదర్శకాలకు అనుగుణంగా గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపిని ప్రారంభించిన విషయం తెలిసిందే.

భారత వైద్య మండలి ICMR మార్గదర్శకాలకు అనుగుణంగా గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపిని ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్లాస్మా థెరపీ ప్రస్తుతం సత్ఫలితాలిస్తోంది. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేనందున ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి ప్లాస్మాను ఎక్కించి ప్రాణాలను కాపాడుతున్నారు. ఇప్పటికే గాంధీలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ కరోనా బాధితునికి రెండుసార్లు ప్లాస్మా ఎక్కించడంతో కోలుకుంటున్నాడు. సుమారు 16 మంది కరోనా బాధితులు ఆక్సిజన్‌పై ఉండగా వారిలో ఆరుగురిని ప్లాస్మా థెరపీ కోసం ఎంపిక చేసి ఐసీఎంఆర్‌కు పంపారు. దాతల నుంచి దాతల నుంచి సేకరించిన ప్లాస్మాను గాంధీ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో మైనస్‌ 18 డిగ్రీల సెల్సియస్‌ ఫ్రీజర్‌ బాక్సుల్లో భద్రపరిచారు. దీంతో ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురు కరోనా బాధితులకు సరిపడే ప్లాస్మా అందుబాటులో ఉంది. ఐసీఎంఆర్‌ ఆదేశాలతో మిగిలిన వారికీ సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ ప్రారంభించే అవకాశం ఉందని ఓ వైద్యుడు తెలిపారు.

ఐసీఎంఆర్‌ నిబంధన ప్రకారం ఒక వ్యక్తికి ప్లాస్మా ఎక్కించిన తర్వాత వారు కోలుకుంటున్నట్లయితే వారికి రెండో డోస్‌ ఎక్కించాలి. ఒక వేల మొదటిడోస్‌ ప్లాస్మా ఎక్కించినప్పటికీ ఆ వ్యక్తి కోలుకోకపోతే అతనికి రెండో డోస్‌ ఇవ్వరు. అయితే ఈ నెల 14వ తేదీన పాతబస్తీకి చెందిన 44 ఏళ్ల బాధితునికి 200 ఎంఎల్‌ ప్లాస్మాను ఎక్కించారు. తొలిసారి ఎక్కించిన ప్లాస్మాతో బాధితుడు కాస్త కోలుకోవడంతో అతనికి ఈనెల 16వ తేదీన రెండో డోస్‌గా మరో 200 ఎంఎల్‌ ప్లాస్మాను ఎక్కించారు. కాగా రెండో సారి ప్లాస్మాను ఎక్కించుకున్న బాధితుడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నలుగురు దాతల నుంచి ప్లాస్మా సేకరించామని ఆస్పత్రి పాలన యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories