తెలంగాణలో కొత్తగా 178 కేసులు..

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

S. Srikanth
Published on: 9 Jun 2020 9:32 PM IST
తెలంగాణలో కొత్తగా 178 కేసులు..
X
Representational Image

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(ఆదివారం) ఒక్క రోజే 92 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అధికంగా 178కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 143 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి 15, మేడ్చల్10, మహబూబ్ నగర్ 2, మెదక్ 2, సంగారెడ్డి 2, జగిత్యాల 1, ఆసిఫాబాద్ 1, సిరిసిర్ల 1, వరంగల్ రురల్ లో ఒక్కో కేసు నామోదయ్యింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 148 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,920కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1742 మంది డిశ్చార్జ్ అయ్యారు.




S. Srikanth

S. Srikanth

Next Story