Road Accidents: హైదరాబాద్‌లో నిత్యం రోడ్డు ప్రమాదాలు

Frequent Road Accidents in Hyderabad
x

Road Accidents: హైదరాబాద్‌లో నిత్యం రోడ్డు ప్రమాదాలు

Highlights

Road Accidents: రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.

Road Accidents: రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా, వాహనం నడపడానికి రాకపోయినా రోడ్లపైకి వచ్చి ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో నిత్యం ఏదోచోట యాక్సిడెంట్స్‌ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 282 మంది ప్రాణాలు కోల్పోయారు.

చౌరస్తాల దగ్గర, సామాజిక మాధ్యమాల ద్వారా ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా ప్రమాదాల బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సంవత్సరంలో సైబరాబాద్‌లో వేయి 450 ప్రమాదాలు జరగ్గా వేయి 363 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

నగరంలో ద్విచక్రవాహనదారుల నిర్లక్ష్యంతో 550 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 61 మంది మృతిచెందారు. 478 మంది గాయాలపాలయ్యారు. అతివేగం, మద్యం సేవించి బైక్స్‌ నడిపిన కారణంగా పాదాచారులు 79 మంది మృతి చెందారు. ఎదురెదురుగా వాహనాలు ఢీ కొన్న ప్రమాదాల్లో 50 మంది చనిపోగా 345 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories