Telangana: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రెంచ్‌ కంపెనీల ఆసక్తి

*రేపు హైదరాబాద్‌కు ఫ్రెంచ్‌ పరిశ్రమల ప్రతినిధులు *మంత్రి కేటీఆర్‌తో సమావేశం కానున్న బృందం

Shilpa
Published on: 7 Oct 2021 5:49 PM IST
French Companies Interested to Invest in Telangana
X

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రెంచ్‌ కంపెనీల ఆసక్తి(ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణ రాష్ట్రంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో వేలాది కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి కంపెనీలు ప్రారంభించాయి. దీంతో లక్షలాది మందికి ఉపాధి దొరుకుతోంది. ఇక రాష్ట్రంలో ఫ్రెంచ్ కంపెనీల పెట్టుబడులను పెంచడానికి మరికొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

ఇండో-ఫ్రెంచ్ వాణిజ్యాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా రేపు వంద మంది ఫ్రెంచ్ పరిశ్రమల ప్రతినిధులతో పాటు దౌత్యవేత్తల ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో పర్యటించనుంది. అనంతరం మంత్రి కేటీఆర్‌ తో సమావేశం కానుంది ఈ బృందం. పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకోనుంది.

Shilpa

Shilpa

Next Story