బైక్ రిపేరింగ్ లో ఉచిత శిక్షణ

బైక్  రిపేరింగ్ లో ఉచిత శిక్షణ
x
బైక్ మెకానిక్
Highlights

భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, మహబూబ్ నగర్ నందు డిసెంబర్ 18 వ తేదీన యువకులకు బైక్ మెకానిక్ లో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది.

నాగర్ కర్నూల్: భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, మహబూబ్ నగర్ నందు డిసెంబర్ 18 వ తేదీన యువకులకు బైక్ మెకానిక్ లో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. కావున ఆసక్తి గల వారు ఈ నెల 17 వరకు సంస్థ కార్యాలయంలో లేదా క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ల ద్వారా మీ పేరు నమోదు చేసుకోగలరు.

అభ్యర్థులు మహబూబ్ నగర్, నారాయణ పేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన వారై ఉండాలి. గమనిక: ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు.. ఉచిత శిక్షణతో పాటు శిక్షణాకాలంలో ఉచిత హాస్టల్ వసతి , ఉచిత భోజన సౌకర్యం, ఉచితంగా యూనిఫారం ఇవ్వబడును.

వివరాలకు 9908788085, 9553632085 (ఉ. 10 గంటల నుండి సా. 5 గంటల వరకు) ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు. సంస్థ చిరునామా: ఎస్బీఐ రెసిటీ, పాత డ్వామా కార్యాలయం, కొత్త ఆర్టీవో ఆఫీస్ ప్రక్కన,బండమీద పల్లి, మహబూబ్ నగర్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories