మొగిలిపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

మొగిలిపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
x
డాక్టర్ వి సుమన్ కోట, డాక్టర్ వై వి సరస్వతి
Highlights

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఈ రోజు అమృత హాస్పిటల్ మెట్ పల్లి వారి సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు.

మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఈ రోజు అమృత హాస్పిటల్ మెట్ పల్లి వారి సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గ్రామానికి చెందిన 424 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ వి సుమన్ కోట, డాక్టర్ వై వి సరస్వతి లతో కలిసి స్థానికంగా సర్పంచ్ వనతడుపుల నాగరాజు ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ముందుకు వచ్చిన అమృత హాస్పిటల్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డాక్టర్ వి సుమన్, డాక్టర్ వై వి సరస్వతి లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిట్టపల్లి మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు చిట్యాల మహేందర్ నవ్య, కొత్తూరు నాగరాజు, ఎస్పీ మైత్రి రమణ, రెండ్ల సాయన్న కాశమ్మ, గంధం కవిత రాజేందర్, బంటు మారుతి, కో ఆప్షన్ సభ్యులు ఉష్కెల చిన్నయ్య, తెలంగాణ తుక్కన్న, నాగుల రమేష్, వంగశేఖర్, దేవ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories