NIMS Hospital in Hyderabad: హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో ఘరానా మోసం

NIMS Hospital in Hyderabad: హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో ఘరానా మోసం వెలుగుచూసింది.

Venkata Chari
Published on: 11 April 2021 5:38 PM IST
Fraud at NIMS Hospital in Hyderabad
X

హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ (ఫొటో హెచ్ఎంటీవీ)

NIMS Hospital in Hyderabad: హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో ఘరానా మోసం వెలుగుచూసింది. వైద్యం కోసం వచ్చిన ఓ రోగితో ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఫీజు కట్టించారు డాక్టర్లు. ఎందుకని ప్రశ్నిస్తే.. బయట డాక్టర్‌ వచ్చి సర్జరీ చేస్తాడంటూ.. రూ.45వేలు ఫీజు వసూలు చేశారు నిమ్స్‌ న్యూరో సర్జన్‌ వంశీకృష్ణ. అంతేకాదు.. సర్జరీ జరగకపోయినా, కుట్లు ఇప్పించుకోవడానికి మళ్లీ రావాలంటూ డిశ్చార్జ్‌ సమ్మరీ ఇచ్చారు.

ఈ విషయంపై నిమ్స్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. దీంతో పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా.. నిమ్స్‌ ఆస్పత్రిలో కొందరు వైద్యులు ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు రోగులు.

Venkata Chari

Venkata Chari

Next Story