మద్యం మత్తులో యువతులు రోడ్డుపై ఏం చేసారో తెలుసా

మద్యం మత్తులో యువతులు  రోడ్డుపై ఏం చేసారో తెలుసా
x

ప్రతీకాత్మక చిత్రం 

Highlights

Ladies Drank Heavy : మద్యం సేవిస్తే ఎవరైనా సరే ఒల్లు తెలియకుండా ప్రవర్తిస్తారనడానికి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలే నిదర్శరం.

Ladies Drank Heavy : మద్యం సేవిస్తే ఎవరైనా సరే ఒల్లు తెలియకుండా ప్రవర్తిస్తారనడానికి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలే నిదర్శరం. మద్యం సేవించి రోడ్లపై తిరుగుతూ ఎదుటి వారిపై దాడులకు దిగడం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం లాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అంతే కాదు మద్యం సేవించిన యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఏడిపించడం లాంటి సంఘటనలు కూడా తరచూ జరుగుతూనే ఉన్నాయి. కానీ మద్యం సేవించిన కొంత మంది యువతులు రోడ్డు ఒల్లు తెలియకుండా ప్రవర్తిస్తూ హల్ చేసే సంఘటనలు చాలా అరుదుగా వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే ఫుల్లుగా మద్యం సేవించిన నలుగురు యువతులు చైతన్యపురి కనకదుర్గ వైన్స్ పరిసర ప్రాంతాల్లో హంగామా చేశారు. దిల్‌సుఖ్‌నగర్ సమీపంలో శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుల్లుగా మద్యం సేవించిన నలుగురు యువతులు ఆ మత్తులో చైతన్యపురిలోని కనకదుర్గ వైన్స్‌ ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో వైట్‌నర్‌ పీల్చుతూ కూర్చున్నారు. కూర్చున్న వారు అలాగే ఉండక వైన్ షాపుకు వచ్చి పోతున్న వారితో అలాగే రోడ్డు వెంట వెళ్తున్నవారితో అనవసరంగా గొడవ పెట్టుకున్నారు.

అంతే కాదు వారిపై దాడులు చేసి వారి వద్ద నుంచి ఆ యువతులు డబ్బులు కూడా లాక్కున్నారట. అంతే కాదు అక్కడే బస్‌స్టాప్‌లో పడుకుని ఉన్న మరో యువకుడిపై రాత్రి 9 గంటల సమయంలో దాడి చేసి బట్టలిప్పి రౌడీల్లాగా ప్రవర్తించారని స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో యువతులు విచ్చలవిడిగా ప్రవర్తించారని, ఇలాంటి సంఘటనలు బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి యువతులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories