లేడీస్ హాస్టల్లో యువకుడి ఘటనలో ట్విస్ట్ !

లేడీస్ హాస్టల్లో యువకుడి ఘటనలో ట్విస్ట్ !
x
Highlights

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ మహిళా హాస్టల్లో ఓ యువకుడు చొరబడి దాదాపుగా 12 గంటలు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత సెక్యురిటి సిబ్బంది సహాయంతో అతనిని రెడ్ హ్యడేండ్ గా...

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ మహిళా హాస్టల్లో ఓ యువకుడు చొరబడి దాదాపుగా 12 గంటలు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత సెక్యురిటి సిబ్బంది సహాయంతో అతనిని రెడ్ హ్యడేండ్ గా పట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. లేడీస్‌ హాస్టల్లో పట్టుబడ్డ యువకుడు కూడా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థేనని, ఓ విద్యార్ధిని సహాయంతోనే అతడు లోపలికి వచ్చినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

అంతేకాకుండా ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థినులను సస్పెండ్‌ చేసినట్టుగా ముందుగా వార్తలు వచ్చినప్పటికీ అవి అవాస్తమని, ఎవరిని సస్పెండ్‌ చేయకుండా కేవలం కౌన్సెలింగ్‌ మాత్రమే ఇచ్చి పంపించివేశారని తెలుస్తోంది! అయితే అన్ని గంటలపాటు యువకుడు లేడిస్ హాస్టల్లో ఉండడంతో యువకుడిపై చర్యలు లేకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి నివేదించేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

అయితే దీనిపైన విద్యాశాఖా మంత్రి ఆదిమూలం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీలో సెక్యురిటీ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలిచ్చారు.

అంతకుముందు ఎం జరిగింది?

గది కిటికీ ఊచలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన అ యువకుడు దాదాపుగా అక్కడే 12 గంటల పాటు అక్కడే ఉన్నాడు... కళాశాలలో ఈ నెల 14 నుంచి 16 వ తేదీ వరకు టెక్ ఫెస్ట్ నిర్వహించారు. అందరూ ఆ హాడావుడిలో ఉండగా, అదే కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ఓ యువకుడు 16 వ తేదీన అర్ధరాత్రి 12 గంటల సమయంలో చొరబడ్డాడు. అయితే గదిలో ఉన్న మిగతా నలుగురు అమ్మాయిలు బయటకు వెళ్లి రూమ్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. అలా బయటకు వెళ్లిన అమ్మాయిల్లో ఒకరు ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలపడంతో వారు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లగా మంచం కింద యువకుడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories