గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా సోకిన నలుగురు ఖైదీలు పరారీ

X
Highlights
four prisoners escape from gandhi hospital: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు...
Arun Chilukuri27 Aug 2020 8:13 AM GMT
four prisoners escape from gandhi hospital: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారయ్యారు. చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా వైరస్ సోకడంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల్లో వారికి పాజిటీవ్ నిర్ధారణ కావడంతో అక్కడినుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్ కళ్లుగప్పి కోవిడ్ వార్డు నుంచి పారిపోయారు. ఉదయం వారు కనిపించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. ఆస్పత్రి నుంచి తప్పించుకున్న ఖైదీల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గతంలో కూడా ఒకసారి గాంధీ ఆస్పత్రి నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ కాగా రెండు రోజుల్లో పోలీసులు వారిని పట్టుకుని గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
Web Titlefour prisoners escape from Gandhi hospital
Next Story