TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజిలో మరో నలుగురు అరెస్ట్

Four More Arrested in TSPSC Paper Leak
x

TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజిలో మరో నలుగురు అరెస్ట్ 

Highlights

TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లిక్‌లో నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్య అరెస్ట్

TSPSC: తెలంగాణలో TSPSC పేపర్ లీక్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈకేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిందితుల జాబితా అంతకంతకు పెరుగుతోంది. ఈకేసులో తాజాగా సిట్ అధికారులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. దీంతో పేపర్ లీక్ కేసులో అరెస్టైన పాత్రధారులు, సూత్రధారుల సంఖ్య 35కి చేరుకుంది. బుధవారం అరెస్ట్ చేసిన వాళ్లలో ఈ పేపర్ లీక్ స్కామ్‌ కేసులో సూత్రధారిగా ఉన్నటువంటి రాజశేఖర్‌ భార్యతో పాటు మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. వాళ్లను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది.

TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు వేగంగా విచారణ జరుపుతున్నారు. తాజాగా కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి రాజశేఖర్‌ భార్యతో పాటు మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారిలో 35మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన వాళ్లను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సిట్ అధికారులు వారిస్తున్న సమాచారం ప్రకారం కొత్త వాళ్లను ... ఈవ్యవహారంతో సంబంధాలు ఉన్న వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. అయితే పేపర్ లీక్ స్కామ్‌లో మరికొందరు ఉన్నట్లుగా సిట్ భావిస్తోంది. వాళ్ల పేర్లను బయటకులాగి ..కటకటాల వెనక్కి పంపేందుకు విచారణ వేగవంతం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories