నయీమ్ కేసులో సత్వర విచారణ జరిపించాలి : గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

నయీమ్ కేసులో సత్వర విచారణ జరిపించాలి : గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
x
Highlights

పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోయిన నయీమ్ కేసులో నిజానిజాలు సత్వరమే తేల్చేలా చూడాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు తెలంగాణా గవర్నర్ నరసింహన్...

పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోయిన నయీమ్ కేసులో నిజానిజాలు సత్వరమే తేల్చేలా చూడాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు తెలంగాణా గవర్నర్ నరసింహన్ కు వినతి పత్రం సమర్పించారు. నయీమ్ ఎన్ కౌంటర్ లో పెద్ద ఎత్తున సొమ్ము దొరికిందనీ, అలాగే పలువురు పోలీసు అధికారులతో నయీమ్ కు సంబంధాలున్నాయనీ అప్పట్లో ప్రచారం జరిగిందని ఈ సందర్భంగా వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. నిజానికి ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో దొరికిన డబ్బును లెక్కించడానికి మిషన్ లు కావాలనీ, అంత పెద్ద ఎత్తున సొమ్ము ఉందనీ పోలీసులు మొదట్లో తెలిపారు. తరువాత రెండు మిషన్లతో డబ్బు లెక్కించి కేవలం 3,74,660 రూపాయలు మాత్రమే సొమ్ము దొరికినట్టు సిట్ ప్రకటించింది. ఇంత తక్కువ సొమ్ము లెక్కించడానికి కౌంటింగ్ మిషన్ల అవసరం ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు సమాధానం ఇంతవరకూ దొరకలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. అదేవిధంగా.. సీబీఐ తో విచారణ అవసరమని అప్పట్లో డిమాండ్ చేయగా ఆ అవసరం లేదని చెప్పారనీ, కానీ మూడేళ్లు గడుస్తున్నా కేసు విషయంలో ఇప్పటికీ నిజానిజాలు బయటకు రాలేదనీ వారు వినతి పత్రంలో తెలిపారు.

లెక్కకు మించిన కేసులు (సుమారు 250) నయీమ్ పై ఉన్నట్టు చెబుతున్న పోలీసులు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? 2003 నుంచి 2005 వరకు నయీమ్ పై 8 నేరమయ కేసులు రిజిస్టర్ చేసి, వాటిని విత్ డ్రా చేసి తిరిగి అతను మరణించిన తరువాత వాటిని తెరిచారు. అలా ఎందుకు జరిగింది. అదీ కాకుండా ఆ సమయంలో నయీమ్ తో అనేక మంది రాజకీయ నాయకులకు సంబంధం ఉందని పోలీసులు చెప్పారు. ఇప్పటికీ వారెవరన్నది ప్రకతిన్చాలేకపోయారు. తదుపరి కాలంలో వారు అధికారంలోకి రావడంతో కేసు నీరు కారుస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. సిట్ విచారణ ప్రకారం అదనపు ఎస్.పి. నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు 25 మంది పోలీసు అధికారులకు నయీమ్తో సంబంధాలు ఉన్నాయి. అయితే ఇంతవరకు వారిపై సరియైన చర్యలు గైకొనలేదు. బహుశ వారిపై చర్యలు తీసుకున్న నయీమ్తో అంటకాగిన పోలీసు పెద్దల పేర్లు కూడ బయటకు వచ్చే ప్రమాదమున్నందున 25 మంది పోలీసు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని భావిస్తున్నాం. ఇక పెద్ద ఎత్తున భూలావాదేవీలు (సుమారు 500 కోట్లు) జరిగాయని చెప్పారు. ఇందులో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ అధికారుల హస్తం కూడా ఉందని చెప్పారు. ఈ విషయంలోనూ సిట్ ఏమీ చేయలేకపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా నయీమ్ డైరీ. అప్పట్లో దొరికిందని చెబుతున్న డైరీలో ఎన్నో విషయాలు ఉన్నాయనీ, వాటి ఆధారంగా దర్యాప్తు చేసి నిజాలు బయటకు తీస్తామనీ సిట్ అధికారులు చెప్పారు. కానీ, ఇంతవరకూ అటువంటిది ఏమీ జరగలేదు. అని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఈ కేసు కేవలం ఒక నేరచరిత్రుడైన నయీమ్ కు సంబంధించినది కాదానీ, ఇందులో పోలీసు, రాజకీయనాయకులు కలసి అమాయకులను దోచుకున్నరనీ గవర్నర్ దృష్టికి తీసుకువస్తున్నట్టు తెలిపారు. నయీంతో చేతులు కలిపిన రాజకీయనాయకులు, పోలీసు అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని,

ఈ కేసులో త్వరాగా సరియైన, న్యాయపరమైన దర్యాప్తు జరిపి చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేసి, త్వరగా నాయయనిర్ణయం జరిగేల చూడాలనీ వినతి పత్రంలో కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories