Kuna Srisailam Goud: బీజేపీపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తి

Kuna Srisailam Goud: భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నాయకులతో శ్రీశైలం చర్చ

Shekhar G
Published on: 29 Feb 2024 4:28 PM IST
Former Quthbullapur MLA Kuna Srisailam Goud Is Unhappy With BJP
X

Kuna Srisailam Goud: బీజేపీపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తి

Kuna Srisailam Goud: బీజేపీపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో షాపూర్‌నగర్‌లోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి బీజేపీ టికెట్ ఆ‎శిస్తున్న కూన శ్రీశైలం గౌడ్. అయితే మల్కాజ్‌గిరి టికెట్ తనకు రాదన్న సంకేతాలతో మనస్తాపం చెందినట్లు సమాచారం.

ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపినట్లు టాక్. కుత్బుల్లాపూర్‌లో బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చాయని.. కాబట్టి మేడ్చల్ జిల్లాలో పట్టున్న తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే స్థానికులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నాయకులతో కూన శ్రీశైలం గౌడ్ చర్చలు జరుపుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story