కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

Arun Chilukuri
Updated on: 8 Aug 2020 1:35 PM IST
కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి
X

former mp Nandi Yellaiah passes away: కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(85) కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య.. జులై 29న నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత పది రోజుల నుంచి కరోనా చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నంది ఎల్లయ్య ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story