KTR: హైడ్రా కూల్చివేతలపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్‌

KTR: నా పేరుతో ఏ ఫాంహౌస్‌ లేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 Aug 2024 3:00 PM IST
Former Minister KTR responded to the demolition of Hydra
X

KTR: హైడ్రా కూల్చివేతలపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్‌

KTR: హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. తన పేరుతో ఏ ఫాంహౌస్‌ లేదని అన్నారు. తన మిత్రుడి ఫాంహౌస్‌ లీజుకు తీసుకున్నానని తెలిపారు. ఆ బఫర్‌ జోన్‌లో ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తాని చెప్పారు. మంత్రి పొంగులేటి ఫాంహౌస్‌ ఎఫ్‌టీఎల్‌ ఉందని.. ఆయన సోదరుడు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారని కేటీఆర్‌ తెలిపారు. మధుయాష్కీ, కేవీపీ ఇళ్లను కూడా కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఎఫ్‌టీఎల్‌‌లో ఫాంహౌస్‌ ఎలా కట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతల పెద్దపెద్ద ఫాంహౌస్‌ల సంగతేంటి? అని అన్నారు. రేవంత్‌రెడ్డి ఫాంహౌస్‌ కూడా ఎక్కడ ఉందో చూపిస్తాని కేటీఆర్ సవాల్ విసిరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story