KTR: నేతన్నల ఆత్మహత్యల పై మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

KTR: నేతన్నలవి ఆత్మహత్యలు కావు... ప్రభుత్వ హత్యలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 Jun 2024 8:57 PM IST
Former minister KTR open letter on the suicides of  weavers
X

KTR: నేతన్నల ఆత్మహత్యల పై మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

KTR: నేతన్నలవి ఆత్మహత్యలు కాదని... ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నేతన్నల ఆత్మహత్యలపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదులోరా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 మంది నేతన్నలు ఆత్మబలిదానం చేసుకున్నారని... ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దని సూచించారు. నేతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కొనసాగించాలన్నారు కేటీఆర్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story