KTR: కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంలో లంచావతారాలు చెలరేగుతున్నాయంటూ ట్వీట్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Sept 2024 5:10 PM IST
Former minister KTR allegations against the Congress government
X

KTR: కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లంచావతారాలు పెరిగిపోతున్నాయంటూ ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పారదర్శక విధానం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ బీపాస్‌ను తుంగలో తొక్కి.. కాంగ్రెస్ సర్కార్ విచ్చలవిడిగా అవినీతిని ప్రోత్సహిస్తుందంటూ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ దగ్గర ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని hmdaలో భారీ ఎత్తున పేరుకుపోతున్న ఫైళ్లు దేనికి సంకేతమని ప్రశ్నించారు కేటీఆర్. కారణాలు లేకుండా ఫైళ్లను అధికారులు ఎందుకు తొక్కిపెడుతున్నారని.. దాని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలని కోరారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story